HYDERABAD YS SHARMILA DEEKSHA JOBS RECRUITMENT ISSUES IN TELANGANA VB
Ys sharmila deeksha: ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి.. నిరుద్యోగుల ఆత్మహత్యల పాపం ప్రభుత్వానిదే..
Ys sharmila deeksha: హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ దగ్గర వైఎస్ షర్మిల దీక్షను ప్రారంభించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ నిరుద్యోగులు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపెడుతున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని కాలర్ ఎగరేసిన తెలంగాణ నిరుద్యోగులు ఇప్పుడు అవమానంతో తల దించుకుంటున్నారన్నారు.
హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ దగ్గర వైఎస్ షర్మిల దీక్షను ప్రారంభించారు.
2/ 13
తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
3/ 13
తెలంగాణ నిరుద్యోగులు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపెడుతున్నాయన్నారు.
4/ 13
ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని కాలర్ ఎగరేసిన తెలంగాణ నిరుద్యోగులు ఇప్పుడు అవమానంతో తల దించుకుంటున్నారన్నారు.
5/ 13
అయితే.. కరోనా నిబంధనలు పాటిస్తూ మూడ్రోజుల పాటు శాంతియుతంగా నిరాహార దీక్ష చేయడానికి పర్మిషన్ అడిగితే..
6/ 13
ఒక్క రోజులో అది 7 గంటలే పర్మిషన్ ఇవ్వడం ఎంత వరకు న్యాయం? నిరాహార దీక్ష చేస్తామంటే ప్రభుత్వానికి వణుకెందుకు పుడుతోందని ప్రశ్నించారు.
7/ 13
ప్రభుత్వశాఖల్లో మొత్తం 3 లక్షల 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా.. ఆరున్నరేండ్లలో రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 35,460 మాత్రమే.
8/ 13
కానీ, ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు అప్లై చేసుకున్న నిరుద్యోగులు 40 లక్షల మంది ఉన్నారు.
9/ 13
ఒక్కొక్కరికి 28 నెలలుగా పెండింగ్ లో ఉన్న రూ.84 వేల నిరుద్యోగ భృతిని తక్షణమే.. ప్రతి నిరుద్యోగి అకౌంట్లో వేసి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
10/ 13
పీఆర్సీ నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న 1,91,126 శాంక్షన్డ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
11/ 13
నోటిఫికేషన్లు రాక మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరా శోభన్ అన్నారు.
12/ 13
నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ఇటీవల నిర్వహించిన ఖమ్మంలో నిర్వహించిన షర్మిల సంకల్ప సభలో ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే..