Formula E Race: హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు పోటీలు సూపర్ సక్సెస్ .. విన్నర్‌గా నిలిచిన జీన్ ఎరిక్
Formula E Race: హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు పోటీలు సూపర్ సక్సెస్ .. విన్నర్‌గా నిలిచిన జీన్ ఎరిక్
Formula E Race:హైదరాబాద్‌లో నిర్వహించిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. ఈ సందర్భంగా విన్నర్‌కు మంత్రి కేటీఆర్ బహుమతి అందజేశారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. ఈ సందర్భంగా విన్నర్‌కు మంత్రి కేటీఆర్ బహుమతి అందజేశారు. (Photo:Twitter)
2/ 10
సాగరతీరాన నిర్వహించిన రేసు విజయవంతమైంది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసుర్లు దూసుకెళ్లాయి. (Photo:Twitter)
3/ 10
ఫార్ములా ఈ రేస్ పోటీల్లో 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లు పార్టిసిపేట్ చేశారు. విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం మంత్రి కేటీఆర్ పోటీల వల్ల కలిగిన అసౌకర్యానికి మన్నించాలని హైదరాబాద్ నగరవాసులను విజ్ఞప్తి చేశారు.(Photo:Twitter)
4/ 10
సాగరతీరాన జరిగిన ఫార్ములా ఈ రేసు చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్‌తో పాటు సినీ ప్రముఖులు రామ్ చరణ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ హాజరయ్యారు.(Photo:Twitter)
5/ 10
వీరితో పాటు సచిన్, చాహల్, ధావన్ తదితరులు ఫార్ములా ఈ రేసు వీక్షించారు. కాగా కార్ల వేగం ప్రేక్షకుల కేరింతలతో సాగరతీరం హోరెత్తిపోయింది. ఫార్ములా ఈ రేస్ పోటీలకు అనేక దేశాలు శాశ్వత హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. (Photo:Twitter)
6/ 10
అందులో ప్రధానంగా దిరియా, మెక్సికో సిటీ, బెర్లిన్, మొనాకో, రోమ్, లండన్, జకార్తా, సియోల్ వంటి నగరాల్లో ఈ పోటీ ఏటా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయి. (Photo:Twitter)
7/ 10
ఇక మీదట భారతదేశంలో నుంచి హైదరాబాద్ ఈ నగరాల జాబితాలో చేరనుందని నిర్వాహకులు వెల్లడించారు.కాగా ఫార్ములాలో మొత్తం 16 రేసులు నిర్వహిస్తారు. ఒక్కో రేస్‌లో రేసర్ పొందిన పాయింట్ల వారీగా సీజన్ల వారీ పాయింట్లు కలిపి, చివరకు ప్రపంచ చాంపియన్‌ను ప్రకటిస్తారు.(Photo:Twitter)
8/ 10
పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలు కాకుండా కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలతో రేస్ చేయడమే ‘ఫార్ములా ఈ’ రేసింగ్ ప్రత్యేకత. ఎలక్ట్రిక్ కార్ల ద్వారా సుస్థిర రవాణాను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. (Photo:Twitter)
9/ 10
భారతదేశంలో ఈ పోటీలు నిర్వహించేందుకు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీపడినా ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో ఈ ప్రతిష్టాత్మక పోటీలు హైదరాబాద్ వేదికగా జరగడం విశేషం. (Photo:Twitter)
10/ 10
2014 బీజింగ్ ఒలింపిక్స్ గ్రౌండ్ దగ్గర మొట్టమొదటి ‘ఫార్ములా ఈ’ జరిగింది. 2014లో బీజింగ్‌లో ఈ రేస్ ప్రారంభం కాగా చివరిసారి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగింది. ఇవాళ హైదరాబాద్‌లో రేసు జరిగింది. ఆ తర్వాత దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్లోజరుగనుంది.(Photo:Twitter)