Hyderabad:యువతి అంకుల్ని పెళ్లి చేసుకుంటానంది..ఆ ఒక్క మాటకు ఫ్లాట్ అయిపోయి..
Hyderabad:యువతి అంకుల్ని పెళ్లి చేసుకుంటానంది..ఆ ఒక్క మాటకు ఫ్లాట్ అయిపోయి..
Cyber cheating:హైదరాబాద్‌లో అమ్మాయి వేసిన వలలో పడ్డాడో వృద్ధుడు. రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి ..ప్రొఫైల్ మ్యాట్రిమొని సైట్లో చూసి చీట్ చేసింది. 45లక్షలు కాజేసింది.
అమ్మాయిలు కాస్త క్లోజ్‌గా మాట్లాడినా, చనువుగా ప్రవర్తించినా , ఫోన్లో చాటింగ్ చేసినా కుర్రాళ్లే కాదు వృద్దులకు కూడా ప్రేమించాలనే మూడ్ వస్తుందని ఆ యువతి పసిగట్టింది.(ప్రతీకాత్మకచిత్రం)
2/ 12
తన అవసరాలు, ఆర్ధిక ఖర్చుల కోసం డబ్బులు సంపాధించేందుకు ఓ వెడ్డింగ్ మ్యాట్రిమొని సైట్ బాగా వాడుకుంది. రెండో పెళ్లి కోసం మ్యాట్రిమొనిలో రిజిస్టర్ చేసుకున్న ఓ కస్టమర్ డిటెయిల్స్ సేకరించింది.(ప్రతీకాత్మకచిత్రం)
3/ 12
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో ఉండే ఓ యాభై సంవత్సరాలు పైబడిన వ్యక్తిని ట్రాప్ చేసింది. గుట్టుగా అతని పర్సనల్ ప్రొఫైల్‌ని మ్యాట్రిమొని సైట్లో చూసి ప్రేమ పేరుతో గాలం వేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 12
పేరు, వివరాలు తెలియగానే ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేసి ఆ అంకుల్‌కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది యువతి. తానో ఇంజనీరింగ్ స్టూడెంట్‌ని అని..తన వయసు 25సంవత్సరాలు అంటూ మాయ చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 12
అమ్మాయి చనువుగా మాట్లాడటం, పర్సనల్ డిటెయిల్స్ షేర్ చేసుకోవడంతో అంకుల్ ఫిదా అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మేశాడు. ఫేస్బుక్లో గంటల కొద్ది చాటింగ్ చేస్తూ అంకుల్ని తన దారిలో పడేలా చేసింది మాయలేడి. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 12
కొన్ని రోజులు గడవగానే ..కాలేజీ ఫీజులు కట్టాలని డబ్బులు లేవంటూ కష్టాల సీడీ వేసింది. అమ్మాయి వేసిన ఉచ్చులో పడ్డాడు సదరు బాధితుడు. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడంతో తనకు కాబోయే భార్యే కదా అన్న ఫీలింగ్‌లో ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 12
మరోసారి ఫోన్ చేసి తనకు కరోనా వచ్చిందని ట్రీట్మెంట్, మెడిసిన్ కోసం డబ్బులు కావాలంటూ నడి వయస్సు కలిగిన వ్యక్తిని నమ్మించింది. అమ్మాయి అడగటమే ఆలస్యం డబ్బులు పంపిస్తూ వచ్చాడు. (ప్రతీకాత్మకచిత్రం)
8/ 12
ఇలా అనే సాకులు, కారణాలు, అవసరాల పేరుతో అంకుల్ దగ్గర నుంచి గట్టిగా డబ్బులు పిండుకుంది. కొద్ది రోజుల్లోనే సుమారు 45లక్షల రూపాయలు తీసుకుంది. (ప్రతీకాత్మకచిత్రం)
9/ 12
ఈవిషయంలో సుమారు అరకోటి పోగొట్టుకున్న వ్యక్తి..ఒక్కసారి కలుద్దామని..పెళ్లి ప్రస్తావన తేవడంతో యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. నో చాటింగ్, నో మెసేస్. అంతే తనను ఓ యువతి పెళ్లి పేరుతో మోసం చేసిందని గ్రహించాడు వ్యక్తి. (ప్రతీకాత్మకచిత్రం)
10/ 12
ఆలస్యంగా కళ్లు తెరుచుకున్న బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. యువతికి సంబంధించిన ఫోన్ మెసేజ్‌లు, ఫేస్బుక్ ఐడీ ఆధారంగా కూపీ లాగుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
11/ 12
ఆమె ఫ్రెండ్స్ లిస్ట్, కాంటాక్ట్ లిస్ట్‌తో పాటు ఫోన్‌కాల్ డేటా వివరాల కోసం టెక్కిల సాయం తీసుకుంటున్నారు. వృద్ధుడి రిక్వెస్ట్ మేరకు పోలీసులు యువతి పేరు, వివరాలు, బాధితుడి డిటెయిల్స్ గోప్యంగా ఉంచారు. (ప్రతీకాత్మకచిత్రం)
12/ 12
యువతి అడ్రస్ తెలుసుకొని పట్టుకుంటామని బాధితుడికి భరోసా ఇచ్చారు సైబర్ క్రైమ్ పోలీసులు. పెళ్లి పేరుతో మ్యాట్రిమొనికి డిటెయిల్స్ ఇవ్వడం వల్ల సదరు వ్యక్తి పెళ్లి కాకుండా 45లక్షలు చదివించుకోవాల్సి వచ్చిందని బాధపడుతున్నాడట. (ప్రతీకాత్మకచిత్రం)