కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైళ్లను (Vande Bharat) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎనిమిది రైళ్లను ప్రారంభించింది. గంటకు 160-`180 కి.మీ. వేగంతో ఇవి దూసుకెళ్లగలవు. ఇందులో అత్యాధునిక సౌకర్యాలున్నాయి. పట్టాలపై వెళ్లే విమానంలా అనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
చెత్తాచెదారంతో నిండి ఉన్న వందేభారత్ ఎక్స్ప్రెస్ బోగీ ఫొటోను అవనిశ్ శరణ్ అనే ఐఏఎస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. బోగీ మొత్తం చెత్తతో నిండిపోవడంతో.. ఓ పారిశుధ్య కార్మికుడు వాటిని చీపురుతో శుభ్రం చేస్తున్నాడు. ఆ ఫొటోకు ఆయన ‘‘వి ద పీపుల్’’ అని క్యాప్షన్ పెట్టాడు. (ప్రతీకాత్మక చిత్రం)