Medaram: మేడారం జాతరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ని కిషన్ రెడ్డి అంత మాట అన్నారా..?
Medaram: మేడారం జాతరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ని కిషన్ రెడ్డి అంత మాట అన్నారా..?
Medaram: మేడారం సమ్మక్క, సారక్క జాతరకు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, రేణుకాసింగ్ హాజరయ్యారు. వనదేవతల్ని దర్శించుకున్న అనంతరం ఎదురుపడిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుని మర్యాదపూర్వకంగా పలకరించారు. అదే సందర్భంలో కేంద్ర, రాష్ట్ర మంత్రికి మధ్య చిన్న సరదా సంభాషణ జరిగింది.
1/ 10
వనదేవతల పండుగగా కొలిచే జాతరకు కేంద్ర పర్యాటకశాఖ, సాంస్కృతిశాఖ మంత్రి జి. కిషన్రెడ్డి, కేంద్ర గిరిజనాభివృద్దిశాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ మేడారం వనదేవతల్ని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం మీడియా పాయింట్ దగ్గర జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రమంత్రులు ఒకరికొకరు ఎదురుపడ్డారు.
4/ 10
అక్కడే ఓ ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. కిషన్రెడ్డి ఎర్రబెల్లి దయాకర్రని గిరిజనాభివృద్దిశాఖ మంత్రి రేణుక సింగ్కి పరిచయం చేస్తూ తెలంగాణలో గట్టి మంత్రి అంటూ చేతులతో గట్టి అనే అర్థం వచ్చేలా సంకేతం ఇచ్చారు.
5/ 10
అంతే కాదు పంచాయతీ మంత్రి అంటూ కిషన్ రెడ్డి చెప్పగానే ఎర్రబెల్లి స్పందించారు. పంచాయతీలు పెట్టే మంత్రిని కాను, పంచాయతీలు పరిష్కరించే మంత్రి ని అంటూ, రేణుక సింగ్తో అనడంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.
6/ 10
ఇవాళ మేడారంలో నిండు జాతర కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో భక్తులకు సౌకర్యాలు, వీఐపీ దర్శనాలతో పాటు భద్రత ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
కేంద్రమంత్రుల మేడారం పర్యటనకు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వచ్చారు. ఆయన్ని కూడా కలిసిన ఎర్రబెల్లి దయాకర్రావు దర్శనం ఏర్పాట్లను చూశారు.
9/ 10
ఇవాళ మేడారంలో నిండు జాతర కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో భక్తులకు సౌకర్యాలు, వీఐపీ దర్శనాలతో పాటు భద్రత ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
10/ 10
సీఎం కేసీఆర్ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ముఖ్యమంత్రి బస చేసిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడి భద్రత సిబ్బంది, ఆలయ వాలంటీర్లను భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు మంత్రి.