Hyderabad: కన్నుల పండువగా వేంకటేశ్వరస్వామికి పుష్పయాగం .. వైభవోత్సవాలను చూసి తరించిన భక్తులు
Hyderabad: కన్నుల పండువగా వేంకటేశ్వరస్వామికి పుష్పయాగం .. వైభవోత్సవాలను చూసి తరించిన భక్తులు
Hyderabad:హైదరాబాద్లో తిరుమల శ్రీవారి వైభవోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీవారికి పుష్పయాగం నిర్వహించారు వేదపండితులు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవంలో భాగంగా నేడు సప్తవర్ణశోభితమై దర్శనమిచ్చారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో చివరి రోజు శనివారం స్వామివారికి పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు వేదపండితులు.
2/ 7
దేవ దేవుడికి సుగంధాల్ని వెదజల్లే రంగు రంగుల పుష్పాలు, పత్రాలను శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసస్వామివారికి సమర్పించారు. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
3/ 7
నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకులు , అధికార అనధికారులు , భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా శ్రీవారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుష్పయాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని వేద పండితులు తెలిపారు.
4/ 7
తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం మూడు టన్నుల పుష్పాలతో శ్రీవేంకటేశ్వరస్వామి వారికి పుష్పయాగం నిర్వహించారు వేదపండితులు.
5/ 7
పుష్పయాగం సందర్భంగా వేద పండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. వైభవోత్సవాల్లో భాగంగా చివరి రోజు పుష్పయాగం ముగిసిన తర్వాత చివరగా నక్షత్ర హారతి ఇచ్చారు.
తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేని భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గరున్న ఎన్టీఆర్ స్టేడియంలో గత ఐదు రోజులుగా ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.