TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్త బస్సుల్లో ఉచిత వైఫై
TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్త బస్సుల్లో ఉచిత వైఫై
TSRTC AC Sleeper Buses: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. అత్యాధునిక సదుపాయం కలిగిన ఏసీ స్లీపర్ బస్సులు వచ్చేశాయి. మరి ఇవి ఏయే మార్గాల్లో తిరుగుతాయి? ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణఆర్టీసీ శుభవార్త చెప్పింది. తొలిసారిగా హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నాయి.
2/ 7
ప్రైవేట్ బస్సుల్లో ఉన్న అన్ని సౌకర్యాలు ఇందులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.
3/ 7
హైదరాబాద్ ఎల్బీనగర్లోని విజయవాడ మార్గంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కొత్త ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించనున్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటికి కూడా నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే.. లహరి అమ్మఒడి అనుభూతిగా నామకరణం చేశారు.
4/ 7
ఏసీ స్లీపర్ బస్సులకు అత్యాధునిక సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వీటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు.
5/ 7
12 మీటర్ల పొడవు ఉంటే ఏసీ స్లీపర్ బస్సుల్లో... 15 లోయర్ బెర్త్‌లు, 15 అప్పర్ స్లీపర్ బెర్త్‌లు ఉంటాయి. బెర్త్‌ల వద్ద మొబైల్ చార్జింగ్, రీడింగ్ ల్యాంప్ సౌకర్యం ఉంటుంది. .అంతేకాదు ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.,
6/ 7
బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. గమ్యస్థానాల వివరాలు తెలిపేలా బస్సు ముందు, వెనుక ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులుంటాయి. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం ఏర్పాటు చేశారు.
7/ 7
కాగా, తెలంగాణ ఆర్టీసీ ఇటీవల కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను సంస్థ ప్రారంభించింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏసీ స్లీపర్ బస్సులను తీసుకొచ్చింది.