TSRTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా? టికెట్ ధరలు పెరిగాయని తెలుసా?
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా? టికెట్ ధరలు పెరిగాయని తెలుసా?
TSRTC: నేటి నుంచి టోల్ ఫీజులతో పాటు ఆర్టీసీ బస్సు చార్జీలు కూడా పెరిగాయి. కేంద్రం టోల్ చార్జీలను పెంచడంతో దానికి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ కూడా టికెట్ ధరలను పెంచింది.
కొత్త ఆర్థిక సంవత్సరంలో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. పలు రకాల వస్తువుల ధరలు పెరగడంత పాటు టోల్ చార్జీలు కూడా పెరిగాయి. కేంద్రం టోల్ చార్జీలను పెంచడంతో.. దానికి అనుగుణంగా టీఎస్ఆర్టీస కూడా టికెట్ ధరలను పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో.. ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు షాకిచ్చింది టీఎస్ఆర్టీసీ. టోల్ చార్జీల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా బస్సుల్లో ఆర్టీసీ బస్సు టికెట్ చార్జీలను పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఒక్కో టికెట్‌పై రూ. 5 నుంచి రూ.20 వరకు అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. అర్ధరాత్రి నుంచే అన్ని బస్సుల్లో టికెట్ ఛార్జీలను పెంచేసింది ఆర్టీసీ. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. నేరుగా టికెట్ ధరల పెంపును అమలు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
బస్ భవన్ నుండి వాట్సాప్ ద్వారా ఆర్టీసి ఉద్యోగులకు సమాచారం ఇచ్చి.. ఆర్టీసీ చార్జీలను ఉన్నపళంగా పెంచండంపై ఆర్టీసీ ప్రయాణికులు మండిపడుతున్నారు. ముందస్తు ప్రకటన చేయకుండా ఇష్టానుసారం ధరలను పెంచడమేంటని వాపోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
కాగా, నేటి నుంచి టోల్‌గేటు ఫీజులు పెంచిన విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఐదు శాతంపైగా ఫీజులను పెంచుతున్నట్టు NHAI తెలిపింది. ప్రస్తుతం ఉన్న రేట్లకు కార్లు, జీపులకు అదనంగా రూ.5 నుంచి రూ.10 వరకు పెంచారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
అలాగే బస్సులు, లారీలకు రూ.15 నుంచి రూ.25 వరకు, భారీ వాహనాలకు రూ.40 నుంచి రూ.50 వరకు టోల్ ఫీజు పెరిగి. నెలవారీ జారీచేసే పాస్ ధరలను కూడా పెంచుతూ ఎన్హెచ్ఏఐ అధికారులు ఆదేశాలు జారీచేశారు.(ప్రతీకాత్మక చిత్రం)