Revanth Reddy: TSPSC పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పేపర్ లీకేజిలో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలను సిట్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.