అంతే కాదు ఎక్స్ప్రెస్ పార్శిల్ లో బుక్ చేసుకున్న వారికి ...పార్శిల్ తీసుకోవాల్సిన వారికి మెసేజ్లు పంపుతామని పేర్కొన్నారు. అంతే కాదు ఈ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ఏజెంట్ల వ్యవస్తను విస్తరింపజేస్తామన్నారు ఎండీ సజ్జనార్.ఈ కామర్స్ సంస్థలతో చర్చలు టైర్-3నగరాలకు సేవలు విస్తరిస్తామన్నారు.(Photo Twitter)
వేగంగా పార్శిళ్లను చేరవేసేందుకే ఎక్స్ప్రెస్ కార్గో సేవలను అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలిపారు. ఎక్స్ప్రెస్ పార్శిల్ సేవల సమాచారం కోసం 9154680020నెంబర్కి ఫోన్ చేయాలి లేదంటే www.tsrtcparcel.in ద్వారా లాగిన్ అయి కూడా తెలుసుకోవచ్చని సజ్జనార్ తెలిపారు. అలాగే జీవా మినరల్ వాటర్, పెట్రోల్ బంకులను కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు.(Photo Twitter)