ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు దగ్గరయ్యేందుకు ..ఫలితంగా సంస్థను లాభాల బాటలో తీసుకెళ్లేందుకు వినూత్న రీతిలో ఆలోచిస్తోంది. ప్రయాణికులకు పండుగ దినాలు, ప్రత్యేక రోజుల్లో ఆఫర్లు, స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికులకు టికెట్‌పై డిస్కౌంట్ ఇస్తోంది. (FILE PHOTO)
ఏపీఎస్ ఆర్టీసీకి పోటాపోటీగా తమ సంస్ధను నడుపుతున్న ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం మరో అరుదైన అవకాశంతో పాటు టికెట్‌పై రాయితీని ప్రకటించారు. అయితే ఈ రాయితీ సీజన్‌తో పని లేకుండా, పండుగ రోజులతో పాటు మిగిలిన రోజుల్లో కూడా వర్తించేలా ప్లాన్ చేశారు.(FILE PHOTO)