మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎం.పద్మా దేవేందర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి టి.హరీశ్ రావు, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, వొడితెల సతీష్ కుమార్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఓంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ములుగు జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్, జనగామ జిల్లా అధ్యక్షుడు పి.సంపత్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా (Mahbubnagar) అధ్యక్షుడు సి.లక్ష్మారెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షు జి.కృష్ణమోహన్ రెడ్డి లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు జయపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి , స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.