వి.వి. విగ్రహం నుంచి ఖైరతాబాద్ వంతెన, నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్‌ను వీవీ విగ్రహం వద్ద షాదన్ , సిరంకారి భవన్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సెక్రటేరియట్ ఓల్డ్ గేట్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
కర్బలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ వద్ద డీబీఆర్ మిల్స్ వైపు మళ్లిస్తారు. ఇక డీబీఆర్ మిల్స్ నుంచి వచ్చే వాహనాలను చిల్డ్రన్ పార్క్ వైపు అనుమతి లేదని చెప్పారు. మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రబాద్ స్టేషన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను నల్లగుట్ట జంక్షన్ వద్ద మళ్లిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)