వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏ యువతి.. ఆరు నెలల క్రితం హైదరాబాద్ వెళ్లి సినిమాల్లో ఛాన్స్ కోసం ట్రై చేసింది. కొన్నిరోజుల క్రితం ఎట్టకేలకు ఓ సినిమాలో అవకాశం వచ్చింది. అదే సినిమా షూటింగ్ లో ప్రకాశం జిల్లా ఉయ్యాలవాడ మండలం సింగంపల్లి ప్రాంతానికి చెందిన మాలపాటి రామకృష్ణతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం అతడు రహమత్ నగర్లో నివాసముంటున్నాడు. (ప్రతీకాత్మకచిత్రం)