Cat Crime : పిల్లిని అలా చేశారు.. ముగ్గురు అరెస్టు
Cat Crime : పిల్లిని అలా చేశారు.. ముగ్గురు అరెస్టు
Cat Crime : పిల్లులు అందరికీ ఇష్టమే. కానీ వాటికి కూడా కొన్ని రక్షణ చట్టాలున్నాయి. పిల్లులు, కుక్కల విషయంలో ఈ చట్టాలను తప్పక తెలుసుకోవాలి. మరి వారు ఏం చేశారో తెలుసుకుందాం.
హైదరాబాద్ దగ్గర్లోని నేరేడ్‌మెంట్‌లో నమోదైన నేరం ఇది. పిల్లికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు జైలుపాలయ్యారు. వారు చేసిన నేరం అలాంటిది మరి (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
పోలీసుల ప్రకారం జీకే కాలనీలో ఉంటున్న రుతువర్ష... ఐదు పిల్లుల్ని తన ఇంట్లో పెంచుకుంటున్నారు. వాటిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. మంచి ఆహారం పెడుతూ.. సాకుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
40 ఏళ్ల నర్సింగ్, 38 ఏళ్ల కిరణ్, 35 ఏళ్ల శంకర్.. రోజూ ఆ ఇంటి ముందు నుంచీ వెళ్లేవాళ్లు. వాళ్లకు తరచూ ఆ పిల్లులు కనిపించేవి. ముద్దుగా, బొద్దుగా ఉండే ఆ పిల్లుల్ని వాళ్లు అదోలా చూసేవాళ్లు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
తాజాగా ఆ ఐదు పిల్లుల్లో ఒకటి కనిపించలేదు. రుతువర్ష.. ఇల్లంతా వెతికినా లేదు. పక్కింటి వాళ్లను అడిగితే.. అక్కడా కనిపించలేదు. చుట్టుపక్కల కుక్కలు కూడా లేవు. మరి ఆ పిల్లి ఏమైంది? రుతువర్ష తీవ్ర ఆవేదన చెందారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
అక్కడి ఓ సీసీటీవీ ఫుటేజ్ గమనించగా.. ముగ్గురు వ్యక్తులు.. ఇంటి వరండాలో ఆడుకుంటున్న పిల్లుల్లో ఒక దాన్ని ఎత్తుకు పోతున్న దృశ్యం కనిపించింది. అది చూసిన రుతువర్ష షాక్ అయ్యారు. ఎలాగైనా దాన్ని విడిపించుకోవాలని.. పోలీసుల్ని ఆశ్రయించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
పోలీసులు... తరచూగా అటుగా వెళ్లే వ్యక్తుల ఫొటోలను సీసీ కెమెరాల ద్వారా సేకరించి.. ఆ ముగ్గురూ ఎవరో స్థానికుల్ని ఆరా తీయడం ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఆ ముగ్గురూ వినాయక నగర్లో ఉంటూ సెంట్రింగ్ పనులు చేస్తున్నారని గుర్తించారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
వినాయక్ నగర్ వెళ్లి.. వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పిల్లి ఎక్కడ అని ప్రశ్నించారు. దాన్ని చంపి వండుకొని తినేశామని ఆ ముగ్గురూ చెప్పడంతో.. పోలీసులే ఆశ్చర్యపోయారు. ముగ్గుర్నీ అరెస్టు చేసి.. రిమాండ్‌కి తరలించారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఇలా జరుగుతున్నాయి చాలా ఘటనలు. పిల్లుల్ని కూడా ఎత్తుకుపోయి తినేసేవాళ్లు మన సమాజంలో ఉంటున్నారు. పెంపుడు జంతువుల్ని పెంచుకునేవారు... ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)