హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, అంబర్పేట్, నల్లకుంట, నాచారం, ఓయూ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లపై వర్షపు నీరు పరుగులు పెడుతోంది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, కింగ్ కోఠి, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌లో భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది.
కూకట్‌పల్లిలోని పలు కాలనీల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలో వరద నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
దీంతో జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించే పనుల్లో ఉన్నారు. ఉదయం నుంచి మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 18.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ రూరల్‌లో 13 సె.మీ.ల వర్షపాతం నమోదైంది. నిర్మల్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో 12 సె.మీ.ల చొప్పున వర్షపాతం నమోదవ్వగా.. పలు జిల్లాల్లో 8 నుంచి 10 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.
అంతేకాకుండా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 317.000 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను..ప్రస్తుత నీటి నిల్వ 6.731 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 16,000 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో 17,553 క్యూసుక్కులుగా కొనసాగుతోంది. అలాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా నదిలోకి(శ్రీశైలం వైపు) 13,777 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)