రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన నిధులు, ఇతర పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలకు నివేదికలు అందజేయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ (TRS Parliamentary Party) సమావేశమైంది.
తొలి దశ సమావేశాలు (Sessions).. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు (Corona cases) పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.