News Ration Cards: పేదలకు శుభవార్త.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు.. వారిని అనర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం.. వివరాలివే..
News Ration Cards: పేదలకు శుభవార్త.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు.. వారిని అనర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం.. వివరాలివే..
News Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి (జూలై 26) అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. రేపటి నుంచి (జూలై 26) అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను అందజేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు.. పౌర సరఫరాల శాఖ సమాచారం అందించింది. ప్రతీకాత్మక చిత్రం
3/ 10
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్న వారికి ఆగస్టు నుంచి రేషన్ బియ్యం అందజేయనున్నారు.
4/ 10
జూన్ లోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుండగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 4,46,169గా ఉండగా, వీటిని అన్ని దశల్లో పరిశీలన చేశారు.
5/ 10
అయితే అందులోని డూప్లికేట్ లు లేకుండా ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి అన్ని కోణాల నుంచి పరిశీలించి.. 3,09,083 మందిని అర్హులుగా తేల్చారు. దాని కోసమనే సమయం ఎక్కువ పట్టిందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
అర్హులైన వారిలో ఎక్కువగా హైదరాబాద్ లో 56,064 లో ఉండగా.. రంగారెడ్డిలో 35,488 మందిని, మేడ్చల్‌లో 30,055 మంది ఉన్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
రేషన్ కార్డుల విషయంలో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేశామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
ఏడు ఎకరాలకంటే ఎక్కువ భూమి, ఫోర్ వీలర్ వెహికల్స్ కలిగి ఉండడంతో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించినట్లు మంత్రి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
ఇప్పటికే పేదల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. ప్రతీకాత్మక చిత్రం
10/ 10
ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)