Telangana Students: నేటి నుంచి ఆ పరీక్షల నిర్వహణ..! పరీక్ష సమయాన్ని కుదించిన అధికారులు.. వివరాలివే..
Telangana Students: నేటి నుంచి ఆ పరీక్షల నిర్వహణ..! పరీక్ష సమయాన్ని కుదించిన అధికారులు.. వివరాలివే..
Telangana Students: కరోనా మహమ్మారి కారణంగా పెండింగ్ లో ఉన్న పరీక్షలను జూలై 8 నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. పరీక్షలకు సంబంధించి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పెండింగ్‌లో పడిన అన్ని పరీక్షలను జూలై 8 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ఒక ప్రకటన చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
వాస్తవానాకి ఓయూ పరిధిలోని అన్ని కాలేజీల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ కోర్సులకు సంబంధించిన మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ ఏడాది మార్చి/ఏప్రిల్ నెలల్లో జరగాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆ పరీక్షల నిర్వహణ సాధ్యపడలేదు. దాంతో పెండింగ్ పరీక్షలు అన్నింటినీ ఈ నెల 8 నుంచి నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
పరీక్షలకు సంబంధించి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు చేయలేదని, గత మార్చిలో విద్యార్థులకు జారీచేసిన హాల్టికెట్లలో ఏవైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో ఆయా కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని ఓయూ అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
అయితే పరీక్షల సమయాన్ని మూడు గంటలకు బదులుగా రెండు గంటలకు కుదించినట్లు వెల్లడించారు. ఆ మేరకు ప్రశ్నల సంఖ్య, మార్కులలో కూడా మార్పులు చేసినట్లు ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
డిగ్రీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలను రోజు విడిచి రోజు కాకుండా అన్ని రోజుల్లో జరుగుతాయని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
ఇలా చేయడం వల్ల ఐదో సెమిస్టర్ విద్యార్థులకు విద్యాసంవత్సరం వృథా కాకుండా ఆరో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలవుతుందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)