-గచ్చిబౌలి స్టేడియం, త్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి మధ్య ఉన్న కంపెనీలు.. వారి ఆఫీస్ టైమింగ్స్ మార్చుకోవాలి. గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు.. గచ్చిబౌలి జంక్షన్ వద్ద నుంచి బొటానికల్ గార్డెన్- కొండాపూర్ ఏరియా ఆస్పత్రి-మసీదు బండ- మసీదు బండ కమాన్- హెచ్‌సీయూ డిపో రోడ్డు మార్గంలో వెళ్లాలి. లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాలు.. హెచ్‌సియు డిపో రోడ్డు- మసీదు బండ కమాన్- మసీదు బండ-కొండాపూర్ ఏరియా ఆస్పత్రి- బొటానికల్ గార్డెన్ మార్గంలో వెళ్లాలి.
-విప్రో నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు.. క్యూ సిటీ- గౌలిదొడ్డి- గోపనపల్లి ఎక్స్ రోడ్డు- హెచ్‌సీయూ బ్యాక్ గేట్- నల్లగండ్ల మీదుగా వెళ్లాలి. విప్రో నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు.. ఫెయిర్‌ఫీల్డ్ హోటల్- నానక్‌రామ్‌గూడ రోటరీ- ఔటర్ రింగ్ రోడ్డు- ఎల్అండ్ టీ టవర్స్ మార్గంలో వెళ్లాలి. కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు.. కేబుల్ బ్రిడ్జ్‌పైకి ఎక్కే ర్యాంప్ నుంచి రైట్ తీసుకొని రత్నదీప్- మాదాపూర్ పీఎస్- సైబర్ టవర్స్- హైటెక్స్- కొత్తగూడ- బొటానికల్ గార్డెన్ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)