దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో పాఠశాలలు తెరిచే అవకాశం ఉంది. అదే విధంగా వారాంతవు సంతల్లో కోవిడ్ నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 40, భద్రాద్రి కొత్తగూడెం 101, జీహెచ్ఎంసీ 1372, జగిత్యాల 67, జనగామ 40, జయశంకర్ భూపాలపల్లి 42, గద్వాల 40, కామారెడ్డి 43, కరీంనగర్ 80, ఖమ్మం 135, మహబూబ్నగర్ 79, ఆసిఫాబాద్ 19, మహబూబాబాద్ 45, మంచిర్యాల 76, మెదక్ 60, మేడ్చల్ మల్కాజిగిరి 288 కేసులు నమోదయ్యాయి.