Trafic police: ఈనెల18 నుంచి తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ .. ఈసారి ఎలాంటి వాహనదారులపై గురి పెట్టారంటే
Trafic police: ఈనెల18 నుంచి తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ .. ఈసారి ఎలాంటి వాహనదారులపై గురి పెట్టారంటే
Trafic police | Hyderabad: హైదరాబాద్ సిటీలో తప్పుడు నెంబర్ ప్లేట్లు పెట్టుకొని వాహనాలు నడిపే వాళ్లకు, తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తోనే వాహనాలపై తిరిగే వాళ్ల కోసం ట్రాఫిక్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈనెల 18నుంచి మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ సిటీలో దర్జాగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్ సిటీలో పలుచోట్ల గత రెండు వారాలుగా వాహనాలను ఉపయోగించి అత్యాచారాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న ఘటనలు తెరపైకి రావడంతో ట్రాఫిక్ పోలీసులు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 8
నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వెహికల్స్‌తో పాటు కార్లను టింటెడ్ గ్లాస్ (బ్లాక్ ఫిలిం అతికించిన వాటిని గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఈనెల 18వ తేది నుంచి వీటిపైనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 8
వాహనదారులు నిబంధనలను పాటించకపోవడం, మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ సిటీలో దర్జాగా వాహనాల్లో తిరుగుతున్న వారికి పోలీసులు ఈనెల 18నుంచి గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.
4/ 8
ఈనెల 18వ తేది నుంచి చేపట్టబోయే స్పెషల్ డ్రైవ్‌లో రిజిస్ట్రేషన్ చేయని నిబంధనలు పాటించని వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 8
వాహనాన్ని నడిపే వారితోపాటు వాహన యజమానిపై కూడా చర్యలు ఉంటాయన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. . అలాంటి నిబంధనలు ఉల్లంఘించే వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని (ట్రాఫిక్ హెల్ప్‌లైన్- 9010203626) నెంబర్ని ప్రకటించారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 8
ఇప్పటికే జంటనగరాలతో పాటు శివారు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్‌తో విస్తృతమైన తనిఖీలు చేపడుతున్నారు. ఎలాంటి ధృపత్రాలు లేని వాహనాలు, తప్పుడు పత్రాలు సృష్టించి రన్నింగ్‌లో ఉంచిన వాహనాల్ని పట్టుకుంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 8
ఇందులో భాగంగానే మూసాపేట్ వడ్డెర బస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. సరైన పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలు, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
8/ 8
వాహనదారులారా జాగ్రత్త. మీరు రోడ్లపైకి వచ్చే ముందే చెక్ చేసుకోండి. కొత్త వాహనాల ఓనర్లైతే తాత్కాలిక రిజిస్ట్రేషన్ గడువు ముగిస్తే వెంటనే బైక్, కారు రిజిస్ట్రేషన్ చేయించుకోమని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. (ప్రతీకాత్మకచిత్రం)