ఇప్పటి వరకు ఫలితాలు ఎప్పుడు వెల్లవడుతాయనే సందిగ్ధంలో ఉన్న స్టూడెంట్స్‌కి తెలంగాణ స్టేట్ ఇంటర్ బోర్డ్ ప్రకటనతో క్లారిటీ ఇచ్చింది. అలాగే ఫలితాలపై వస్తున్న వదంతులు, సృష్టిస్తున్న తప్పుడు ప్రచారాలను పేరెంట్స్ తల్లిదండ్రులు నమ్మవద్దని ఇంటర్ బోర్డ్ అధికారులు తమ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
తెలంగాణ ఇంటర్ ఫలితాలను స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు మూడు వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. విద్యార్ధులు ఫలితాలు తెలుసుకునేందుకు https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.inవెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని సూచించాయి బోర్డ్ వర్గాలు. (ప్రతీకాత్మకచిత్రం)