వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్న త్రిష.. ఆల్ రౌండర్. వీరి స్వస్థలం భద్రాచలం. హైదరాబాద్లో ఈమె ఫ్యామిలీ స్థిరపడింది. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టి 8 ఏళ్ల వయసులోనే అండర్–16లో ప్రాతినిధ్యం వహించింది. ఇక యశశ్రీ స్వస్థలం హైదరాబాద్. ఈమె మీడియం పేసర్. గాయంతో తప్పుకున్న హర్లీ గలా స్థానంలో జట్టులోకి వచ్చి.. ఒక మ్యాచ్ ఆడింది.