HYDERABAD TELANGANA RECORD IN CORONA VACCINATION 6CRORE DOSES COMPLETED BY THE GOVERNMENT SNR
TELANGANA: వ్యాక్సినేషన్లో మరో రికార్డ్..6కోట్ల డోసులు పూర్తి
TELANGANA:వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలో మొత్తం 6కోట్ల డోసులు పంపిణి చేసింది. 12-147ఏళ్ల మధ్య వయసున్న 11.36లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేస్తున్న వైద్య,ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి హరీష్‌రావు అభినందించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ రాష్ట్రం మరో రికార్డు సృష్టించింది. ప్రభుత్వ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రెండు డోసులు కలిపి సోమవారం సాయంత్రానికి 6 కోట్లు దాటింది.
2/ 7
రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 3.11 కోట్ల మందికి మొదటి డోస్, 2.83 కోట్ల మందికి రెండో డోస్, 5.18 లక్షల మందికి ప్రికాషనరీ డోసులు పంపిణీ చేయడం జరిగింది.
3/ 7
కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈస్థాయిలో కృషి చేయడాన్ని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
4/ 7
12-14 ఏండ్ల మధ్య వయసున్నవారికి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 11.36 లక్షల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ప్రభుత్వం.
5/ 7
ఇప్పటివరకు 19 శాతం పూర్తయింది. కరోనా వైరస్ నుండి రక్షణ పొందేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని మంత్రి హరీష్‌రావు ఈసందర్భంగా పిలుపునిచ్చారు.
6/ 7
ఇక గడిచిన 24గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 73పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనే 33కేసులు బయటపడ్డాయి.
7/ 7
తెలంగాణలో కొత్తగా 91మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 639మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.