కండ్లు చెదిరేలా పర్యాటక హంగులు కల్పించారు. విద్యుద్దీపాలు అలంకరించి.. ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా అంపీ థియేటర్, పూడికతీత తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పరికరాల ప్రదర్శన కోసం గ్యాలరీ, చక్కటి పచ్చదనంతో కూడిన గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. పూర్వవైభవం సంతరించుకుంది. (Photo:Twitter)
నిజాం రాజులు తాగునీటి కోసం కట్టించిన బన్సీలాల్‌పేట మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో పునర్జీవం పోసుకున్నది. ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు. నీళ్లు ఎంత కిందికి వెళ్లినా.. మెట్ల ద్వారా కిందకు దిగి.. కుండ లేదా బిందెతో మంచి నీళ్లు తోడుకోవచ్చు. అయితే కాలక్రమేణా చెత్తా చెదారం నిండిపోయింది.(Photo:Twitter)
బావి పక్కనే ఉన్న మైదానంలో పాత భవనం తొలగించి, కొత్తగా టూరిస్ట్ ప్లాజా భవనం నిర్మించి, ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌ను తీర్చిదిద్దారు. ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక ఓపెన్ యాంపీ థియేటర్, బావిలో నుంచి వెలికితీసిన పురాతన పరికరాల ప్రదర్శన, బావి చరిత్రను వివరించే ఫొటో ప్రదర్శనకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు.(Photo:Twitter)