తెలంగాణ మరో విషయంలో టాప్ ప్లేస్లో నిలిచింది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మాంసం విక్రయం, వినియోగంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది తెలంగాణ. రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న గొర్రెలు, మేకలు చాలక వేరే రాష్ట్రాల నుంచి రోజుకు 80నుంచి వంద లారీల్లో గొర్రెలు, మేకలు తెలంగాణకు తెచ్చి విక్రయిన్నట్లుగా రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ప్రభుత్వానికి ఇచ్చిని నివేదికలో వెల్లడించింది. (ప్రతీకాత్మకచిత్రం)
కరోనా వైరస్ ప్రభావం కారణంగా గత 4-5 ఏళ్లతో పోలిస్తే గడిచిన రెండేళ్లలో మాంసం విక్రయాలు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో మాంసం తినడానికి ఎక్కువ మంది మోజు చూపిస్తున్నారు. వారంలో ఆదివారం మాత్రమే నాన్ వెజ్ తినే సంప్రదాయం నుంచి కనీసం రెండ్రోజులు, మూడ్రోజులు ముక్క రుచి చూడాల్సిందే అన్నట్లుగా విక్రయాలు పెరిగాయి. (ప్రతీకాత్మకచిత్రం)