దళితబంధు ద్వారా లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోన్న రూ.10లక్షలతో ఒకే యూనిట్‌కు పరిమితం కావాలని ఎక్కడా లేదని, ఎక్కువ వ్యాపారాలు చేసుకునే అవకాశం కూడా ఉందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. చిన్న చిన్న యూనిట్లు తీసుకునే లబ్ధిదారులు సీజనల్ వారీ వ్యాపారాలను కూడా ఈ పథకం ద్వారా ఎంచుకోవచ్చని చెబుతున్నారు.(File Photo)
దళిత బంధు ద్వారా ప్రభుత్వం ఇచ్చే 10లక్షలతో పవర్ ట్రిల్లర్, వరి కోత కోసే, వరి వేసే మెషిన్లు, ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు, కార్లు వంటి వాహనాలను కొనుక్కోవచ్చు. పాల డైరీ, కోళ్ల ఫారమ్, ఆయిల్ మిల్, గ్రైడింగ్ మిల్, స్టీల్, సిమెంట్, బ్రిక్ వ్యాపారాలు, ఫర్నీచర్ దుకాణాలు, క్లాత్ ఎంపోరియం, మొబైల్ దుకాణాలు, హోటళ్లు వంటి వ్యాపారం చేసుకోవచ్చు. ఆ డబ్బును మళ్లీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. (File Photo)