HYDERABAD TELANGANA GOVERNMENT HAS ISSUED GUIDELINES FOR ISSUING RATION CARDS HERE IS THE FULL DETAILS VB
Telangana Ration Cards: తెలంగాణ రేషన్ కార్డు.. ఇకపై వారికి మాత్రమే.. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం.. వివరాలివే..
Telangana Ration Cards: ఆహారభద్రతా కార్డుల జారీపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో సోమవారం నుంచి పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి వారి వివరాలను వెరిఫై చేసేందుకు రెవెన్యూ, విద్యా, కో–ఆపరేటివ్, సివిల్ సప్లయ్ శాఖలకు చెందిన సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
పది రోజుల్లో విచారణ పూర్తి చేయడమేగాక దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
దరఖాస్తుదారుల ఇళ్ల చిరునామాల ఆధారంగా ఆయా బృందాలు సమగ్ర విచారణ చేపట్టనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులు, కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి తదితర అంశాలను పరిశీలించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
విచారణ అనంతరం ఆయా వివరాలను అప్లోడ్ చేస్తారు. అనంతరం అర్హులందరికీ కొత్తగా ఆహార భద్రతా కార్డులు జారీ చేయటంతోపాటు రేషన్ కోటా విడుదలకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
దారిద్రరేఖకు దిగువన (బీపీఎల్)ఉన్న వారికి మాత్రమే ఆహార భద్రతా కార్డులను జారీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
పట్టణంలో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు మాత్రమే ఆహర భద్రతా కార్డులకు అర్హులుగా పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ఫోర్ వీలర్ ఉన్న వారిని అనర్హులుగా పేర్కొన్నారు . (ప్రతీకాత్మక చిత్రం)