HYDERABAD TELANGANA CM WILL VISIT SAMMAKKA AND SARAKKA IN THE AFTERNOON FOR THE MEDARAM FAIR SNR
MEDARAM JATARA: నేడు మేడారానికి తెలంగాణ సీఎం..వనదేవతల్ని దర్శించుకోనున్న కేసీఆర్
MEDARAM JATARA: మేడారంలో జరుగుతున్న సమ్మక్క, సారక్క జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ వెళ్లనున్నారు. వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇవాళ నిండు జాతర పేరుతో కార్యక్రమాలు కొనసాగుతాయి.
|
1/ 8
తెలంగాణ కుంభమేళాగా జరుపుకునే మేడారం జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ హాజరుకానున్నారు.
2/ 8
శుక్రవారం ఉదయం 11గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడారం బయల్దేరుతారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
3/ 8
మధ్యాహ్నం 12గంటలకు సీఎం కేసీఆర్ మేడారం చేసుకుంటారు. 12.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతర ప్రాంగణానికి చేరుకుంటారు.
4/ 8
వనదేవతలైన సమ్మక్క, సారక్క గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ముఖ్యమంత్రి. అనంతరం తన ఎత్తు బెల్లంతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు కేసీఆర్.
5/ 8
మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు సీఎం కేసీఆర్.
6/ 8
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఇవాళ కేంద్ర పర్యాటక,సాంస్కృతిక వ్యవహారాలశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వనదేతల్ని దర్శించుకునేందుకు మేడారం వెళ్లనున్నారు.
7/ 8
గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెపైకి తెచ్చారు గిరిజన పూజారులు. రాత్రి 7.14 నిమిషాలకు ములుగు ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవస్తున్నట్లుగా భక్తులకు సంకేతమిచ్చారు.
8/ 8
ఈనెల 16వ తేదిన ప్రారంభమైన మేడారం జాతర ఇద్దరు వనదేవతలు గద్దెను అధిష్టించడంతో ప్రధాన ఘట్టం ముగిసింది. ఇవాళ నిండు జాతర కొనసాగుతుంది.