రాజమౌళి డైరెక్ట్ చేసిన ట్రిపులార్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అయ్యింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట నామినేట్ అయ్యింది. నాటు నాటు పాట సంగీత దర్శకుడిగా కీరవాణి, లిరిక్స్ అందించిన చంద్రబోస్ పేర్లను ప్రచురించింది అకాడమీ టీమ్. నాటు నాటు పాటను రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవ పాడారు. (Photo : Twitter)
RRR ఇప్పుడు 95 వ అకాడమీ అవార్డులలో నామినేషన్ సాధించిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ అద్భుతమైన సాధించినందుకు ఆర్ఆర్ఆర్ బృందాన్ని అభినందిస్తున్నారు భారతదేశానికి చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు నెటిజన్లు. నాటు నాటు మిగితా నాలుగు పాటలతో పోటీ ఆస్కార్‌ను సాధిస్తుందా లేదా అనేది మార్చి 13న తెలుస్తుంది.(Photo : Twitter)
నాటు నాటు పాట పాడిన ఇద్దరు సింగర్లలో ఒకరైన రాహుల్సిప్లీగంజ్ గాత్రానికి దక్కిన గుర్తింపును గౌరవిస్తూ తెలంగాణ బీజేపీ చీప్ బండి సంజయ్‌కుమార్ రాహుల్సిప్లిగంజ్ను సన్మానించారు. శాలువా కప్పి స్వీట్ తినిపించారు బీజేపీ నేతలు. అపూర్వ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడంటూ ట్వీట్ చేశారు.(Photo:Twitter)
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల అవార్డ్స్ వరిస్తున్నాయి. ఇప్పటికే నాటు నాటు పాటకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గోల్డేన్ గ్లోబ్ అవార్డ్ రాగా.. తాజాగా నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అయ్యింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు నామినేట్ అయ్యింది. దీనిపై సింగర్ రాహుల్సిప్లీగంజ్, డైరెక్టర్ రాజమౌళి, కీరవాణి హర్షం వ్యక్తం చేశారు.
తెలుగులో చాలా సినిమాల్లో పాటలు పాటిన రాహుల్సిప్లీగంజ్ ..తనదైన శైలీలో గుర్తింపు తెచ్చుకున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి డైరెక్షన్లో వస్తున్న రంగమార్తండ సినిమాలో కూడా పాటలు పాడారు రాహుల్సిప్లీగంజ్. తెలంగాణ సింగర్‌కు ఇంతటి గుర్తింపు దక్కడంపై సినీ ప్రముఖులు అతడ్ని అభినందిస్తున్నారు.(Photo:Twitter)
2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాటతో సినిమారంగంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ విజేతగా గెలిచి తన క్రేజ్‌ను మరింత రెట్టింపు చేసుకున్నాడు రాహుల్సిప్లీగంజ్. ఈ తెలంగాణ సింగర్‌కు ఇంతటి గుర్తింపు దక్కడంపై అందరూ అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.(Photo:Twitter)