Tarakaratna: తారకరత్న ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Tarakaratna: తారకరత్న ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Tarakaratna Health Updates: నందమూరి తారకరత్న ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. గుండె బాగా పనిచేస్తోందని.. మెదడు మాత్రం కొంత దెబ్బతిందని పేర్కొన్నారు.
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం బెంగళూరులోని నారాయణ హృదయాలకు వెళ్లిన ఆయన.. అక్కడ తారకరత్నను పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
2/ 7
తారకరత్న కుటుంబ సభ్యులతోనూ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. తారకరత్న ఆరోగ్య నిలకడగానే ఉందని చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు అని తెలిపారు.
3/ 7
తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలు బాగున్నాయని... ప్రస్తుతం మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోందని విజయసాయిరెడ్డి వెల్లడించారు. గుండెపోటు వచ్చిన రోజు 45 నిమిషాల పాటు మెదడకు రక్తప్రసరణ ఆగిపోవడంతో.. మెదడులో పైభాగం కొంత దెబ్బతిందని చెప్పారు.
4/ 7
ఐనప్పటికీ..తారకరత్న రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇప్పుడు గుండె బాగా పనిచేస్తోందిని..రక్తప్రసరణ బాగుందని చెప్పారు. కాలేయంతో పాటు ఇతర అవయవాల్లో యాక్టివిటీ కొంత తగ్గిందని పేర్కొన్నారు.
5/ 7
మెదడులో నీరు చేరి వాపు వచ్చిందని.. ఆ వాపు తగ్గితే.. తారకరత్న ఆరోగ్యం మరింత మెరుగవుతుందని చెప్పారు విజయసాయిరెడ్డి. బాలకృష్ణ తానే స్వయంగా తారకరత్నకు అందుతున్న వైద్య చికిత్సను పర్యవేక్షిస్తున్నారని.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
6/ 7
కాగా, నందమూరి తారకరత్నకు జనవరి 27న గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పాదయాత్రలో బాగానే కనిపించిన తారకరత్న.. కొద్దిదూరం నడిచిన తర్వాత గుండెపోటుతో పడిపోయారు.
7/ 7
అనంతరం కుప్పంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం.. అదే రోజు అర్ధరాత్రి బెంగళూరుకు ఆయన్ను తరలించారు. నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఆస్పత్రికి వెళ్లి..పరామర్శించారు.