అక్కడే ఉన్న యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది ఆయన్ను హుటాహుటిన కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత... పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిందని.. ఆయన గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్స్ గుర్తించామని పీఈవెస్ వైద్యులు తెలిపారు