Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అదేంటంటే..
Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అదేంటంటే..
Police Jobs: కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల కిందట స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి పోలీస్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టీ-సాట్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 25,271 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ(GD) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్-CAPF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(SSF) లాంటి సంస్థల్లో ఈ పోస్టులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
అయితే ఈ మొత్తం 25,271 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే పోలీస్ ఉద్యోగాల పోటీపరీక్షలకు టీ-సాట్ ప్రత్యేక కార్యక్రమాలను ఈ నెల 5 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
25,271 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్న దృష్ట్యా తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతకు పరీక్షపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
అభ్యర్థులు సందేహాలను 040-23540326, 23540726, టోల్ ఫ్రీ 18004254039 ఫోన్ నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)