ఉపరితల ద్రోణి ప్రభావంతో మొన్నటి వరకు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిశాయి. వడగండ్లు పడడంతో రైతుల పంటలు ధ్వంసమయ్యాయి. ఐతే మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
సోమవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో ఒకటి లేదా రెండు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
గత వారం కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల మిర్చి, మొక్కజొన్న, వరి పంటలతో పాటు మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్లు పడడంతో తీవ్ర నష్టం కలిగిందని రైతులు వాపోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
బుధవారం నుంచి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణం ఏర్పడుతుంది. వర్షాలు తగ్గిన తర్వాత.. మళ్లీ ఎండలు దంచి కొట్టే అవకాశముంది. గతంలో పోల్చితే ఈసారి ఎండలు ఎక్కువగానే ఉండవచ్చనే అంచనాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)