'సుబ్బయ్యగారి హోటల్'.. పెద్దగా పరిచయం అక్కర్లేని బ్రాండ్ ఇది. కాకినాడలో దాదాపు ప్రతి ఒక్కిరికీ ఈ హోటల్ గురంచి తెలుసు. ఇక్కడ నాణ్యమైన, రుచికరమైన, ఆరోగ్యకమైన భోజనం.. తక్కువ ధరకే లభిస్తుందన్న పేరుంది. అన్నింటికీ మంచి.. మరెక్కడా లభించని.. మర్యాద కూడా ఇక్కడ దొరుకుతుంది. అదే సుబ్బయ్య గారి హోటల్ ప్రత్యేకత.