పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాంలో వినియోగించబోయే ఈ వాహనానికి వారాహి అని పేరు పెట్టడం వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. వారాహి అంటే అమ్మవారి పేరు. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.