Trains Cancelled: తెలంగాణలో వారం రోజుల పాటు ఈ రైళ్లు బంద్..
Trains Cancelled: తెలంగాణలో వారం రోజుల పాటు ఈ రైళ్లు బంద్..
South Central Railway: ఉత్తర తెలంగాణలో రాకపోకలు సాగించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరి ఏయే రైళ్లు రద్దయ్యాయో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
సికింద్రాబాద్ డివిజన్ (Secunderabad Division) పరిధిలోని విరూర్-మాకుడి సెక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కారణంగా ఉత్తర తెలంగాణలో రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
కాజీపేట-బలార్షా మధ్య ప్రతి రోజూ నడిచే రైలు (17035).. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
బలార్షా-కాజీపేట మధ్య ప్రతి రోజూ నడిచే రైలు (17036).. ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 15 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
అంతేకాదు నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. కాజీపేట-సిర్పూర్ టైన్ రైలు (17003) .. బెల్లంపల్లి-సిర్పూర్ టౌన్ మధ్య రద్దయింది. అంటే ఈ రైలు బెల్లంపల్లి వరకే వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్డు (17034) రైలును సిర్పూర్ టౌన్ నుంచి బెల్లంపల్లి వరకు రద్దు చేశారు. ఇది బెల్లంపల్లి నుంచి ప్రారంభమవుతుంది.
6/ 8
కరీంనగర్-సిర్పూర్ టౌన్ రైలు (07765)ను కూడా బెల్లంపల్లి-సిర్పూర్ టౌన్ మధ్య రద్దు చేశారు. ఈ రైలు బెల్లపల్లి వరకు మాత్రమే వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
సిర్పూర్ టౌన్-కరీంనగర్ రైలు (07766)ని సిర్పూర్ టౌన్-బెల్లంపల్లి మార్గంలో రద్దు చేశారు. ఇది కూడా బెల్లంపల్లి నుంచే ప్రారంభమవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)