Secunderabad: రైల్వే ప్రయాణికులకు అలర్ట్ .. ఈ రైళ్లు 9 రోజుల పాటు రద్దు..
Secunderabad: రైల్వే ప్రయాణికులకు అలర్ట్ .. ఈ రైళ్లు 9 రోజుల పాటు రద్దు..
Secunderabad: తెలంగాణ మీదుగా నడిచే కొన్ని రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. మరి ఏయే రైళ్లు రద్దయ్యాయి.. ఏయే రైళ్ల రూట్ మారిందో ఇక్కడ తెలుసుకుందాం.
మధ్య రైల్వే (Central Railway) పరిధిలోని దౌడ్-మన్మాడ్ సెక్షన్లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
దౌండ్ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే డెము రైలు (11409) జనవరి 20 నుంచి జనవరి 28 వరకు రద్దయింది. ఈ 9 రోజులు దౌండ్-నిజామాబాద్ డెము సర్వీసు అందుబాటులో ఉండదు.
3/ 8
నిజామాబాద్ నుంచి పుణెకు వెళ్లే డెము రైలు (11410) జనవరి 22 నుంచి జనవరి 30 వరకు రద్దయింది. ఈ 9 రోజులు నిజామాబాద్-పుణె డెము సర్వీసు అందుబాటులో ఉండదు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
నిజామాబాద్ నుంచి పంఢార్పూర్కి వెళ్లే డెము రైలు (01413) జనవరి 21 అందుబాటులో ఉండదు. ఈ సర్వీసును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
జనవరి 27న నడిచే న్యూఢిల్లీ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు (12628)ను మన్మాడ్, ఇగత్పురి, కల్యాణ్, పన్వేల్, పుణె, దౌండ్ రూట్లో దారి మళ్లించారు.
6/ 8
జనవరి 27న నడిచే బెంగళూరు- న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (12627)ను పుణె, లోనావాలా, కజ్రత్, పన్వేల్, వాసాయ్ రోడ్, వడోదరా, రత్లామ్, నగ్డ, మక్సి, సంత్ హిర్‌ధరమ్ మార్గంలో దారి మళ్లించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
వీటితో పాటు షిర్డీ నుంచి ఏపీ, తెలంగాణకు వచ్చే రైళ్లు ఈ నెల 23 నుంచి 26 వరకు ఆలస్యంగా నడుస్తాయి. మరిన్ని వివరాలకు రైల్ సేవాను సంప్రదించాలని అధికారులు సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)