మనుషులకు కుక్క ఎంతో ఇష్టమైన జంతువు. ప్రస్తుతం కుక్కులు లేని ఇల్లు ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతలా కుక్కులకు మనుషులతో స్నేహా సంబంధం ఏర్పడింది. అయితే ఇళ్లలో ఉండేవి పెంపుడు కుక్కలు కాబట్టి వాటి ఆలనా,పాలనా మనమే చూస్తాం. మరి వీధుల్లో తిరిగే కుక్కల పరిస్థితి ఏంటీ..? సరిగ్గ ఇదే పాయింట్ సాహిత్య వర్ధన్ కు కదిలించింది. (Photo Credit:Face Book)
తన సైకిల్ వెనుక భాగంలో ఐదు నెలల కుక్కు పిల్ల కోసం ప్రత్యేకమైన షెల్టర్తో కూడిన వీల్ వాహనాన్ని తయారు చేయించారు వర్ధన్. అందులోనే తనతో పాటు కుక్కపిల్లను దేశ యాత్ర చేపడుతున్నాడు. తన వెంట పెట్టుకొని తిప్పుతున్న కుక్కపిల్ల కూడా వీధి కుక్కేనని దానికి లెక్సీ అని పేరు పెట్టారు వర్ధన్.(Photo Credit:Face Book)
కుక్కలు ప్రెండ్లీ యానిమల్ అని చెబుతున్న వర్ధన్ ..జాతి కుక్కలకు బదులుగా వీధి కుక్కలను దత్తత తీసుకోవడం, ఇళ్లలో పెంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వీధి కుక్కలు ఆకలితో, అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే దూకుడుగా ప్రవర్తిస్తాయి తప్ప మిగిలిన టైమ్లో ప్రశాంతంగా ఉంటాయని అంటున్నారు.(Photo Credit:Face Book)