ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో థియేటర్ల సంఖ్య తగ్గుతుందన్నారు రాజమౌళి. అతి తక్కువ వ్యయంతో నిర్మించిన థియేటర్ను సందర్శించడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు జక్కన్న. తాను కూడా ఇలాంటి థియేటర్ని ఎప్పటి నుంచో నిర్మించాలని అనుకుంటున్నానని, అయితే మహిళలు ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉందన్న రాజమౌళి వారిపై కొంత ఈర్ష కూడా కలుగుతోందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి థియేటర్లు మరిన్ని నిర్మించాలని కోరుకున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల థియేటర్లు ఉండేవని, ప్రస్తుతం అవి 1800 లకు చేరాయని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి థియేటర్ లతో ఆ సంఖ్య పెరగాలని అన్నారు. బెలూన్ థియేటర్లో సినిమా చూడడం కొత్త అనుభూతిని కలిగించిందని అన్నారు. ఇటువంటి థియేటర్లు నిర్మించడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలని కోరుకున్నారు.