రైల్వే బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులపై క్లారిటీ వచ్చింది. ఏపీ, తెలంగాణకు కలిపి రూ.12,800 కోట్లు కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. ఇందులో రూ.4,418 కోట్లు తెలంగాణలోని ప్రాజెక్టుల కోసం, రూ.8,406 కోట్లు ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేటాయించినట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2009 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.886 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని రైల్వేమంత్రి గుర్తు చేశారు. కానీ ఈసారి బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరిగాయని చెప్పారు. చాలా చోట్ల అండర్ పాస్‌లు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందన్నారు. వీటిలో డబ్లింగ్, ట్రిపులింగ్ చేసే ప్రాజెక్టులు కూడా ఉన్నాయని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలుకు మంచి స్పందన వస్తోందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. త్వరలో వందే మెట్రోలు కూడా రాబోతున్నాయని చెప్పారు. 60-70 కి.మీ దూరం ఉన్న రెండు పట్టణాల మధ్య వందే మెట్రో నడుస్తుందని.. ఇవి వందే భారత్ రైళ్లకు ఉంటాయని వెల్లడించారు. ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాతే వందే మెట్రోను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచామని, త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే మన దేశంలో కోచ్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయని... విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫీజుబులిటి పరిశీలించాల్సి ఉందని అన్నారు. తెలంగాణలో ఎంఎంటీఎస్‌కు రూ.600 కోట్లు కేటాయించామని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)