padayatra : ఓవైపు ఈటల అనారోగ్యం పాలు కావడంతో..ఆయన పాదయాత్ర వాయిదా పడగా..తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు బండి చేస్తానని ప్రకటించిన పాదయాత్ర సైతం ఆయన కారణంగా వాయిదా పడింది..కాగా ఆగస్టు 9నుండి పాదయాత్ర చేయనున్నట్టు బండి సంజయ్ ప్రకటించారు.
ఈటల రాజేందర్ అనారోగ్యం ఎఫెక్ట్... బండి సంజయ్ పాదయాత్రపై కూడా పడింది..హుజూరాబాద్ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పాదయాత్రను హైదరాబాద్లో ప్రారంభించి, హుజురాబాద్లో ముగించాలని నిర్ణయించారు.
2/ 5
అయితే ఈటల రాజేందర్ పాదయాత్ర ఆయన ఆనారోగ్యం కారణంగా ఆగిపోయింది. దీంతో ఆయన తిరిగి పాదయాత్ర చేసేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
3/ 5
ఆయన మోకాలికి చికిత్స చేయనున్న నేపథ్యంలోనే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.. దాంతో ఆయన పాదయాత్ర కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు కొనసాగుతున్నాయి..
4/ 5
ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పాదయాత్ర ఆగస్టు 9 ప్రారంభించాలని భావించినా దాన్ని వాయిదా వేశారు. ప్రధానంగా ఈటల ఆనారోగ్యంతోపాటు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండడం కూడా ఇందుకు అడ్డంకిగా మారినట్టు పార్టీ నేతలు ప్రకటించారు.
5/ 5
అయితే బండి సంజయ్ మొత్తం రాష్ట్రంలో 57 రోజుల పాటు ఐదు విడతలుగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. పాదయాత్ర వాయిదాతో తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే స్పష్టత మాత్రం రాలేదు.