డార్క్ నెట్ వెబ్సైట్ ద్వారా తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉండే యువత, విద్యార్దులు డ్రగ్స్ క్రిప్టో కరెన్సీ ద్వారా కొనుగోలు ఈ కామర్స్ ద్వారా డోర్ డోర్ సప్లై జరుగుతున్నట్లుగా గుర్తించామన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్‌తో పాటు ఆరుగురు హైదరాబాద్ వాసుల్ని అరెస్ట్ చేశామన్నారు.
మొట్టమొదటిసారిగా డార్క్ నెట్ అనే వైబ్‌సైట్ ద్వారా ఈనెట్ వర్క్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు హైదరాబాద్ పోలీసులు. గోవా, రాజస్ధాన్, ఢిల్లీకి చెందిన ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్‌ను గుర్తించినట్లుగా సీవీ ఆనంద్ తెలిపారు. ఈకేసులో ప్రధాన సూత్రధారుడు నరేందర్ నారాయణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన నారాయణ్ గోవాలో స్థిరపడ్డట్లుగా గుర్తించామన్నారు.
గుట్టు చప్పుడు కాకుండా పెద్ద నెట్వర్క్ స్థాయిలో డ్రగ్స్ సప్లై చేస్తున్న కేసులో నిందితుల్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ ముఠా క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లుగా గుర్తించామన్నారు సీపీ ఆనంద్. డ్రగ్ పెడ్లర్లు ప్రధాన నగరాల్లో సబ్ ఏజంట్లను నియమించుకుని డ్రగ్స్ ను విక్రయిస్తున్నారన్నారు. హైద్రాబాద్ లో ఆరుగురు డ్రగ్స్ సప్లయ్ లో ఏజంట్లుగా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు.
ఉమన్ అలియాస్ ఆషు,అబ్దుల్లా ఖాన్, శర్మ లు ఏజంట్లుగా పనిచేస్తున్నట్లుగా సీపీ తెలిపారు. ఈ ముగ్గురు కూడా క్లాస్ మేట్స్ అని తెలిపారు. వీరితో పాటు ఇంద్రకుమార్, సందీప్, చరణ్ కుమార్ లు డ్రగ్ పెడ్లర్లు గా పని చేస్తున్నారన్నారు. వీరి ద్వారా మరో 30 మంది కూడా డ్రగ్స్ కు తీసుకుంటున్నట్టుగా గుర్తించామని హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
ఈ కామర్స్ ద్వారా డ్రగ్స్‌ను అందమైన బాక్సులు, ప్యాకింగ్ కవర్స్‌లో డోర్ డెలవరీ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ భారీ డ్రగ్స్ ముఠా గట్టురట్టు చేసిన పోలీసులు మన రాష్ట్రంలో ఐదుగురు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించామన్నారు సీపీ. మొత్తం 9లక్షల విలువ చేసే డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.అందులో ఎల్ఎస్డీ, చరాస్, ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు గాంజాను సీజ్ చేశారు.
కేవలం నెల రోజుల వ్యవధిలోనే 600మంది డ్రగ్స్ వాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అందులో ఎక్కువగా బీటెక్ స్కూడెంట్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నట్లుగా గుర్తించారు. కొరియర్స్ ద్వారా డ్రగ్స్ ఇంటికి చేరుతున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఇంటికి వచ్చే ప్రతి కొరియర్ని తల్లిదండ్రులు ఓపెన్ చేసి చూడాలని సీవీ ఆనంద్ సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)