సిటీ శివారులోని ఫామ్‌హౌస్‌ల్లో పోలీసుల దాడులు .. బయటపడ్డ అసాంఘీక కార్యకలాపాలు
సిటీ శివారులోని ఫామ్‌హౌస్‌ల్లో పోలీసుల దాడులు .. బయటపడ్డ అసాంఘీక కార్యకలాపాలు
Crime News: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బడాబాబులు నిర్మించుకున్న ఫామ్‌హౌస్‌ల్లో వికృత చేష్టలు, అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందడంతో ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో అసాంఘీకశక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ విశ్వనగరంగా మారడంతో సిటీలోని పబ్బులతో పాటు శివార్లలో ఫామ్ హౌస్‌ల్లో యువత ఎంజాయ్మెంట్ పార్టీ పేరుతో అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా సంపన్నుల బిడ్డలు, స్టూడెంట్స్ విషసంస్కృతిని అలవాటు చేసుకుంటున్నాయి.
2/ 7
ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బడాబాబులు నిర్మించుకున్న ఫామ్‌హౌస్‌ల్లో వికృత చేష్టలు, అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందడంతో ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.(Photo:Face Book)
3/ 7
సిటీతో పాటు నగర శివారు ప్రాంతాల్లోని 32 ఫామ్ హౌస్‌లపై దాడులు నిర్వహించారు ఎస్ఓటీ పోలీసులు. నాలుగు ఫామ్ హౌస్ లలో అసాఘీక కార్యక్రమాలు జరుగుతన్నట్లు గుర్తించినట్లుగా తెలిపారు పోలీసులు.(Photo:Face Book)
4/ 7
మొయినాబాద్‌లోని బిగ్ బాస్ ఫామ్‌హౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలి , శంషాబాద్ పరిధిలోని రిప్లెజ్ ఫామ్ హౌస్, మేడ్చల్‌లోని రెడ్డి ఫామ్ హౌస్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను గుర్తించారు పోలీసులు.(Photo:Face Book)
5/ 7
ఈ దాడుల్లో మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల వద్ద నుండి భారీగా మద్యం బాటిళ్లు, హుక్కా సామాగ్రి, ప్లేయింగ్ కార్డులతో పాటు 1.03లక్షల రూపాయల నగదు, 7 మొబైల్స్ స్వాదీనం చేసుకున్నారు.
6/ 7
నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసి అందులో ఫామ్ హౌస్‌లను ఏర్పాటు చేసుకున్నారు కొందరు బడా బాబులు. ఆ ఫామ్ హౌస్‌ల్లో పార్టీల పేరుతో అసలు ఏం జరుగుతుందనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు.
7/ 7
రేవ్ పార్టీల పేరుతో ఫామ్ హౌస్‌లలో మద్యం, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దాడులు చేస్తే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని నగరప్రజలు కోరుతున్నారు.