రానున్న రోజుల్లో మరికొందరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తారని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాలను రచిస్తున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలపేతంపై సీరియస్గా దృష్టి సారించారు.