అంతకు ముందు కూడా ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ వాయిదా పడింది. వాస్తవానికి జనవరి 19నే హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటించాల్సి ఉంది. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించడంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన పర్యటన వాయిదా పడింది.