Petrol at Home: రోజు రోజుకూ డిజిటల్ దిశగా ప్రపంచం దూసుకుపోతోంది. ఇప్పుడు ఇంటి నుంచి కాలు బయటకు పెట్టకుండానే మన దగ్గరకే అన్ని వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇంటి దగ్గర నుంచి అన్ని సేవలు పొందొచ్చు. సాధారణంగా జొమాటో, స్విగ్గీ లాంటి ఎన్నో యాప్ లు ఇప్పుడు ఫుడ్ ను డెలివిరీ చేస్తున్నాయి. వాటి జాబితాలో ఇప్పుడు పెట్రోల్ కూడా చేరుతోంది.
కేవలం తినే తిండి మాత్రమే కాదు.. కిరాణా షాపులో ఇంటికి కావాల్సిన రేషన్ సరుకులు.. ఇంటికి ఉపయోగపడే వస్తువుల, టీవీ, మోబైల్, ఏపీలు, ఫ్రిడ్జ్ లు ఒకటేంటి.. ఏదీ కావాల్సిన ఇప్పుడు కాలు బయట పెట్టాల్సిన పని లేదు.. ఇంటి దగ్గర ఒక క్లిక్ చేస్తే చాలు అన్ని ఇంటి దగ్గరకే వచ్చేస్తాయి.. వీటికి ఇప్పుడు పెట్రోల్ తోడయ్యింది.