Hyderabad: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో నిర్వహించే రాములవారి కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు 116రూపాయలు చెల్లిస్తే ఇంటికే డోర్ డెలవరీ చేస్తామని ప్రకటించారు. కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు 116రూపాయలను ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో చెల్లించి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
1/ 8
ప్రజా రవాణా వ్యవస్థలో మెరుగైన సేవలందిస్తున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ వస్తువుల ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా సౌకర్యాలను కల్పిస్తూ వస్తోంది. కార్గొ, లాజిస్టిక్స్ సేవల పేరుతో ఆర్టీసీ ఇంటి గుమ్మం వరకు తమ సర్వీసులు అందిస్తోంది.
2/ 8
ప్రత్యేక దినాల్లో ప్రయాణికులకు ఆఫర్లు, కానుకలు ప్రకటిస్తున్న..టీఎస్ ఆర్టీసీ ఈసారి భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణంలోని ముత్యాల తలంబ్రాలను కూడా భక్తుల చెంతకు చేరుస్తోంది. ఇందుకోసం రామయ్య భక్తులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.
3/ 8
శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో నిర్వహించే రాములవారి కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు 116రూపాయలు చెల్లిస్తే ఇంటికే డోర్ డెలవరీ చేస్తామని ప్రకటించారు. కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు 116రూపాయలను ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో చెల్లించి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
4/ 8
భద్రాచలం రాములవారి గుడిలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు భద్రాద్రికి వెళ్తారు. కాని వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ఈ తలంబ్రాలను ఇంటికి చేర్చే బాధ్యతను టీఎస్ ఆర్టీసీ తీసుకుంది.
5/ 8
ఇందులో భాగంగానే బుధవారం హైదరాబాద్ బస్‌భవన్‌లో కల్యాణ తలంబ్రాలు బుకింగ్ పోస్టర్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని..116రూపాయలతో తలంబ్రాలు బుకింగ్‌ను ప్రారంభించినట్లుగా సజ్జనార్ తెలిపారు.
6/ 8
ఎవరైతే రాముల వారి కల్యాణ తలంబ్రాల కోసం 116రూపాయలతో పేర్లు నమోదు చేసుకుంటారో వారికి కల్యాణ మహోత్సవం ముగియగానే ఇంటికే తలంబ్రాలు ఇంటికే పంపిస్తామన్నారు. తలంబ్రాలు కావాల్సిన వారు ఈక్రింది నెంబర్లకు సంప్రదించాలి.
7/ 8
మధ్యాహ్నం 12గంటల లోపు పార్శిల్ బుక్ చేస్తే రాత్రి 9గంటల లోపే డెలవరీ చేసే విధంగా ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది టీఎస్ ఆర్టీసీ. రాత్రి 9గంటల లోపు బుక్ చేసుకుంటే మరుసటి రోజు 12గంటల్లోకు సరుకును గమ్యస్థానానికి చేర్చడం జరుగుతుంది. (ప్రతీకాత్మకచిత్రం)
8/ 8
గతేడాది కూడా 89 వేల మందికి స్వామి వారి కల్యాణ తలంబ్రాలను అందించినట్టు తెలిపారు. ఈ సేవలు పొందాలనుకునేవారు ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగాన్ని 91776 83134, 73829 24900, 91546 80020 నంబర్లలో సంప్రదించాలని కోరారు.