ఆగస్ట్ 22 వరకు వజ్రమహోత్సవాలు కొనసాగనున్నాయి. వజ్రోత్సవాల్లో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. ఈ నెల 16న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగనున్నది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11.30గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా దేశభక్తి వెల్లివెరిసింది. సిద్దిపేట జిల్లాచేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన యువరైతు తిరుపతి స్వాతంత్య్ర వజోత్సవ వేడుకల్లో భాగంగా తన వ్యవసాయ పొలంలో భారతదేశ చిత్రపటం ఆకారంలో పంట సాగు చేశాడు. సేంద్రియ వ్యవసాయ పద్దతిలో దేశీయ విత్తనమైన కాలాబట్టి రకం నలుపు రంగు వడ్లతో భారతదేశ చిత్రపటం వేసి జాతీయ జెండా ఆవిష్కరించి తనదైన శైలిలో దేశభక్తిని చాటుకున్నాడు.